Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్

ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Allu Arjun (Credits: X)

Hyderabad, Oct 6: సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ (madame tussauds) మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దుబాయ్‌ లో ఉన్న ఈ మ్యూజియంలో ఈ ఏడాదే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మేడమ్ టుస్సాడ్స్ పేర్కొంది. అంతేకాదు బన్నీ నుంచి కొలతలు తీసుకున్న వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రూ. 10 లక్షలు జరిమానా విధించండి, ఆ యీడ్ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సిసిపిఎకి ఫిర్యాదు చేసిన సిఎఐటి

స్టైలిష్ స్టార్ స్పందనేంటి?

టుస్సాట్స్‌ లో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేయనుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు. ఇది తనకు ఓ రకంగా ప్రత్యేకమైన అనుభూతి అన్నారు. తాను చిన్నతనంలో టుస్సాడ్స్‌ను సందర్శించిన సందర్భాలు ఉన్నాయని, అలాంటి మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు.

ఆఫర్లే ఆఫర్లు, అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023, పూర్తి వివరాలు ఇవిగో..