Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కారణాలతోనే అతన్ని కలువలేకపోతున్నా.. అంటూ పోస్ట్
‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్ తెలిపారు.
Hyderabad, DEC 15: కేసు విచారణ కొనసాగుతున్నందున శ్రీతేజ్‌ను (Sri Tej) కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ (Allu Arjun) తెలిపారు. సంధ్య థియేటర్ (Sandhya Theatere) వద్ద జరిగిన ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్ తెలిపారు.
Allu Arjun Sends Heartfelt Wishes to 8-Year-Old Sri Tej
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు బన్నీ కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. చికిత్స ఖర్చులూ భరిస్తానని, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈ నెల 13న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంచల్‌గూడ జైలులో ఆ రాత్రంతా ఉన్న ఆయన.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు.