Allu Arjun Video From Pushpa 2: ఉదయం లేచినప్పటి నుంచి షూటింగ్ ప్యాకప్‌ వరకు అల్లు అర్జున్ ఏం చేస్తాడో తెలుసా? పుష్ప -2 సెట్స్ లో సందడిని కళ్లకు కట్టినట్లు చూపించిన అల్లు హీరో (వీడియో ఇదుగోండి)

మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో (Pushpa 2 Sets) షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Allu Arjun Video From Pushpa 2 (PIC@ AA Instagram)

Hyderabad, AUG 30: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన ‘పుష్ప-1’ (Pushpa 1) బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. ఇక ఇటీవల ఈ మూవీకి గాను జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డుని, దేవిశ్రీప్రసాద్ (Devisri prasad) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నారు. దీంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ క్రేజ్ ని మూవీ టీం కూడా తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోబోతున్నారు. అల్లు అర్జున్ నిన్న సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. “రేపు ఉదయం 9 గంటలకు సంథింగ్ స్పెషల్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆ సంథింగ్ స్పెషల్ ఏంటని ఆశగా ఎదురు చూశారు.

Vijay Devarakonda: స్టార్ స్పోర్ట్స్ చానల్లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ 

తాజాగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని (Allu Arjun Post) షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో (Pushpa 2 Sets) షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Instagram (@instagram)

పుష్ప 2 మూవీ సెట్టింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసినట్లుగా చూపించారు. అయితే అల్లు అర్జున్ ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తాడు, తన షూటింగ్ ఎలా సాగుతుంది అనేది ఫ్యాన్స్ కు చెప్తూ వీడియో సాగింది. ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ కు చేరే విధంగా ఇంగ్లీష్ లో తన డే యాక్టివిటీని చెప్పాడు అల్లు అర్జున్. ఈ వీడియోలో అల్లు అర్జును బ్యూటిఫుల్ హౌజ్‌ ను కూడా చూడొచ్చు. ప్రతి దాట్లో AA బ్రాండింగ్‌ లో సరికొత్తగా ఉంది అల్లు అర్జున్ హౌజ్.



సంబంధిత వార్తలు