Kissik Lyrical Video Song Is Out Now: వామ్మో ఇంత కిర్రాక్ మాస్ బీట్ సాంగా? శ్రీ‌లీల స్టెప్స్ కు య్యూట్యూబ్ ద‌ద్ద‌రిల్లిపోతోంది. పుష్ప -2 నుంచి కిస్సిక్ సాంగ్ వ‌చ్చేసింది, చూసేయండి!

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది టీం. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను (Kissik Song) లాంచ్ చేశారు.

Kissik Lyrical Video Song

Hyderabad, NOV 24: టాలీవుడ్‌ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్‌ (Allu Arjun)- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ పుష్ప 2 ది రూల్‌ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది టీం. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను (Kissik Song) లాంచ్ చేశారు. రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్‌ చేసిన ఈ పాటలో అల్లు అర్జున్‌, శ్రీలీల స్టైలిష్ ఊరమాస్ స్టెప్పులతో హోరెత్తిస్తున్నారు. కిస్సిక్‌ సాంగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లీల, బన్నీ స్టైలిష్‌ కలర్‌ఫుల్‌ డ్యాన్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను Sublahshini పాడింది.

Allu Arjun Sreeleela Kissik Lyrical Video Song

సీక్వెల్‌లో ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్ట్‌కు అదిరిపోయే ఆల్బమ్ అందించిన డీఎస్పీ మరోసారి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.