Baby Combo Repeat: మరోసారి తెరమీదకు బేబీ కాంబో, ఆనంద్-వైష్ణవీ లీడ్ రోల్స్‌లో నిర్మాతగా మారిన బేబీ డైరక్టర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫస్ట్ లుక్
ఈ సినిమాని SKN నిర్మించాడు. ఇప్పుడు ఇదే కాంబో మళ్ళీ రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించడమే కాక నిర్మాతగా కూడా మారడం విశేషం.
Hyderabad, OCT 20: ఇటీవల సాయి రాజేష్(Sai Rajesh) దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya ), విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో వచ్చిన బేబీ (Baby) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజయి దాదాపు 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది బేబీ సినిమా. ఈ సినిమాని SKN నిర్మించాడు. ఇప్పుడు ఇదే కాంబో మళ్ళీ రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించడమే కాక నిర్మాతగా కూడా మారడం విశేషం.
బేబీ సినిమా నిర్మాత SKN కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. తాజాగా సముద్రం పక్కన బోట్ లో వైష్ణవి చైతన్య కూర్చొని ఏడుస్తూ ఉండగా ఆనంద్ దేవరకొండ మోకాళ్ళ మీద కూర్చొని వైష్ణవిని చేతుల్లోకి తీసుకుంటున్న ఫొటోని ఫస్ట్ లుక్ కింద షేర్ చేశారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ ఫొటో వైరల్ గా మారింది. తాజాగా ఈ సినిమా షూట్ మొదలయినట్టు ప్రకటించారు. అలాగే ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బేబీ కాంబో మళ్ళీ వస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ఆసక్తి నెలకొంది. కొంతమంది కామెంట్ల రూపంలో ఇది బేబీ 2 అవునా కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఆనంద్ వైష్ణవి ఈ సారి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.