Anasuya Bharadwaj: నా డ్రస్ కోడ్ మీకు నచ్చేలేదా, మీ తాగుబోతు తనం మంచిగా ఉందా, కోట శ్రీనివాసరావుపై మండిపడిన యాంకర్ అనసూయ, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని హితవు

తన దుస్తులు, వేషధారణపై ఓ సీనియర్ నటుడి (Kota Srinivas Rao) వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు.

Anasuya Bharadwaj (Photo Credits: Twitter)

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) సీనియర్ నటుడు కోట తన డ్రెస్ కోడ్ పై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. తన దుస్తులు, వేషధారణపై ఓ సీనియర్ నటుడి (Kota Srinivas Rao) వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న ఆ నటుడు మరీ ఇంత అల్పస్థాయిలో వ్యాఖ్యానించడం విచారకరమని (anchor anasuya bharadwaj fired on kota) పేర్కొన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వ్యక్తిగత విషయం అని, ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న ఆహార్యంలో కనిపించాల్సి ఉంటుందని అనసూయ వివరించారు.

కానీ నేటికీ సోషల్ మీడియాలో వేరొకరి వేషధారణ, దుస్తులపై పనికిరాని చెత్తను ప్రముఖంగా ప్రచారం చేస్తుండడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. అప్పట్లో సోషల్ మీడియా ఉండుంటే ఈ నటుడి తాగుబోతు తనాన్ని, ఇతర విపరీత ధోరణులను ప్రశ్నించి ఉండేదా? అని నిలదీశారు. పెళ్లయి, పిల్లలు కూడా ఉండి, వెండితెరపై చొక్కా లేకుండా బాడీ చూపిస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేసే స్టార్లను ఎందుకు ప్రశ్నించరు?

అనసూయ డ్రస్ మార్చాలి, అప్పుడే బాగుంటుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాస రావు, ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే అంటున్నానని వెల్లడి

నాలాగా పెళ్లయి, ఇద్దరు బిడ్డల తల్లి అయి ఉండి ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ, వృత్తిపరంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారు, అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించేవారు మీకు నచ్చడం లేదా? మీరు మీ అభిప్రాయాలను ప్రజలకు చెప్పడానికి బదులు.. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నించాలి’’ అని అనసూయ ట్వీట్‌లో పేర్కొంది.

Here's Anasuya Bharadwaj Tweets

కాగా టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయపై వ్యాఖ్యలు చేశారు. అనసూయ మంచి నటి అని, అందంగానే ఉంటుందని అన్నారు. అయితే అనసూయ డ్రెస్సింగ్ తనకు నచ్చదని పేర్కొన్నారు. అందంగా ఉండే అనసూయ అలాంటి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదని కోట అభిప్రాయపడ్డారు. కోట వ్యాఖ్యలపైనే అనసూయ పైవిధంగా స్పందించినట్టు అర్థమవుతోంది.



సంబంధిత వార్తలు

Harish Rao On Rythu Bharosa: రైతు భరోసా భోగస్..కనీస మద్దతు ధర ఏది?, రైతులను మోసం చేసినందుకు విజయోత్సవాలా?...సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌ రావు ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Harish Rao Serious On Government: గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ పాల‌న‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర ఆగ్ర‌హం

Bandi Sanjay Slams KTR:  తెలంగాణలో 'ఆర్‌ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్