O Antava OO Antava Song: ఊ అంటావా సాంగ్ మీద హైకోర్టులో కేసు, మగాళ్లు కామంతో ఉంటారా అంటున్న పురుషుల అసోసియేషన్, దీపాలన్నీ ఆర్పేశాక అందరు మగాళ్లదీ వంకర బుద్దేపై అభ్యంతరం
ఈ చిత్రం నుంచి వచ్చిన సమంత ఐటం సాంగ్ ఊ అంటావా మావ.. (O Antava OO Antava Song) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటు ఆ పాట వివాదంలో చిక్కుకుంది
అల్లు అర్జున్ నటించిన పుష్ప(Allu Arjun's Pushpa) సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం నుంచి వచ్చిన సమంత ఐటం సాంగ్ ఊ అంటావా మావ.. (O Antava OO Antava Song) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటు ఆ పాట వివాదంలో చిక్కుకుంది. ఆ సాంగ్ (Case Filed Against Samantha's Item Song) మగాళ్లను కించరిచేలా ఉందని ఏపీ పురుషుల అసోసియేషన్ హైకోర్టులో కేసు వేసింది. పురుషులను చెడు ఉద్దేశంతో రాశారని.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పురుషుల అసోసియేషన్ అందులో మండిపడింది.
మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారనే అర్థం వచ్చేలా ఆ పాట ఉందని పురుషుల అసోసియేషన్ (AP men's association ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పాట భావం అలా ఉందని తెలిపింది. పాటపై నిషేధం విధించాలని, తమకు న్యాయం చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పాటకు చంద్రబోస్ స్వరాలు సమకూర్చగా.. మంగ్లీ సోదరి.. ఇంద్రావతి చౌహాన్ పాట పాడారు. అయితే చివరలో దీపాలన్నీ ఆర్పేశాక అందరు మగాళ్లదీ వంకర బుద్దే అనే స్వరం ఉంది. దీనిని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ పురుషుల అసోసియేషన్ ఏకంగా దీనిపై కేసు వేసింది.
ఈ పాట గురించి చంద్రబోస్ గతంలో మాట్లాడుతూ..సంగీత స్వరకల్పన చరిత్రలో ఈసాంగ్ ఓ రికార్డు అని అన్నాడు. దేవీశీప్రసాద్ 4 మ్యాజికల్ నోట్స్ తో ఈ సాంగ్ కంపోజ్ చేశారు. చరిత్రలో అలా ఎవ్వరూ చేయలేదు. ఇంతకముందు ఇళయరాజా 3 మ్యూజికల్ నోట్స్ తో ఓ పాటను కంపోజ్ చేయగా ఇప్పుడు డీఎస్పీ నాలుగు నోట్స్ తో కంపోజ్ చేశాడని తెలిపాడు. అయితే పాట వివాదంపై ఇంకా స్పందించలేదు.