Silvina Luna: అయ్యో ఎంత ఘోరం.. కాస్మొటిక్‌ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి, మోడల్ సిల్వినా లూనా మృతి

ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (43) (Silvina Luna) మరణించింది.

Credits: X

Newdelhi, Sep 3: అర్జెంటీనాలో (Argentina) ఘోరం జరిగింది. ప్లాస్టిక్ సర్జరీ (Plastic Surgery) వికటించడంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా (43) (Silvina Luna) మరణించింది. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. మోడల్‌గా కూడా రాణిస్తూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. అయితే సిల్వినా గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం వారానికి నాలుగు సార్లు కిడ్నీలకు డయాలసిస్ చేయించుకునేది. అయితే ఇటీవలే కాస్మొటిక్‌ సర్జరీ (Cosmetic Plastic Surgery) చేయించుకోవడానికి వెళ్ళింది.

అయితే, దురదృష్టవశాత్తూ ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతోపాటు ఆ ప్రభావం తన కిడ్నీ సమస్యపై మరింత ఎఫెక్ట్ పడిండి. ఈ క్రమంలో కొన్నిరోజులపాటు ప్రాణాలతో పోరాడిన సిల్వినా చివరకు ప్రాణాలు కోల్పోయింది.