Aindrila Sharma Dies: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి, 24 ఏళ్లకే కన్నమూయడంతో విషాదంలో సినీ పరిశ్రమ, గతంలో రెండు క్యాన్సర్లతో పోరాటం, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పోరాడిన బెంగాలీ నటి

ఇండస్ట్రీలో ఎక్కువమంది కార్డియాక్‌ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించడం చర్చనీయాంశమవుతోంది. అండ్రిలా కొన్నాళ్ల క్రితం రెండు క్యాన్సర్లతో (Cancer) పోరాడి గెలిచారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ (brain stroke) రావడంతో ఆమె నవంబరు 1న ఆస్పత్రిలో చేరారు.

Aindrila Sharma. (Photo Credits; Facebbok)

Kolkata, NOV 20: సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బెంగాలి నటి అండ్రిలా శర్మ (Aindrila Sharma Died) (24) మరణించారు. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా హౌరాలోని ఓ ఆస్పత్రిలో ఆమె (Aindrila Sharma) ఆదివారం కన్నుమూశారు. చిన్న వయసులోనే అండ్రియా చనిపోవడం అందరినీ కలచివేస్తోంది.  ఇండస్ట్రీలో ఎక్కువమంది కార్డియాక్‌ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించడం చర్చనీయాంశమవుతోంది. అండ్రిలా కొన్నాళ్ల క్రితం రెండు క్యాన్సర్లతో (Cancer) పోరాడి గెలిచారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ (brain stroke) రావడంతో ఆమె నవంబరు 1న ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పైనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. ఆ సమయంలో ఆమె పలుమార్లు కార్డియాక్‌ అరెస్ట్‌కు గురయ్యారు.

Director Madan No More: టాలీవుడ్ కి మరో షాక్.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత.. నాలుగు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో మృతి.. ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు 

ఆదివారం మరోసారి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురవడంతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా.. అండ్రిలా కుటుంబానికి  సానుభూతి ప్రకటించారు.

ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన అండ్రిలా ‘జియోన్‌ కతి’, ‘ఝమర్‌’, ‘జిబన్‌ జ్యోతి’ తదితర బెంగాలీ సీరియళ్లతో నటిగా మంచి గుర్తింపు పొందారు. ‘దీదీ నంబరు 1’, ‘లవ్‌కేఫ్‌’ వంటి సినిమాల్లో నాయికగా మెప్పించారు. ఇటీవల ‘భగర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు.