Bengaluru: బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ తెలుగు హీరోలు, సుమారు 15 విలువైన కార్లను సీజ్, వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.
Bengaluru, May 20: బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్‌హౌస్ అనేది హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టుబడ్డ వాళ్లలో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.
సదరు జీఆర్ ఫామ్‌హౌస్ హైదరాబాద్ కాన్‌కార్డ్ సంస్థకు గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దేవర ఫస్ట్ సాంగ్ రిలీజ్! గూస్ బంప్స్ తెప్పిస్తున్న అనిరుథ్ మ్యూజిక్, ఒక్కో పదం వింటుంటే మైండ్ పోతుంది
రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం బెంగళూరు సీసీబీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Here's Video
రేవ్‌పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్‌కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్ రేవ్ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్ ఒరిజినలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.
నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు.