Bigg Boss Kannada 11: వివాదంలో కన్నడ బిగ్ బాస్ షో, న్యాయవాది ఫిర్యాదుతో మహిళా కమిషన్ నోటీసులు, బిగ్ బాస్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న న్యాయస్థానం

కన్నడ బిగ్ బాస్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఈ షో నిర్వాహకులకు నోటీసులు జారీ అయ్యాయి. మహిళ కంటెస్టెంట్ల గోప్యతకు భంగం వాటిల్లిందని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

Bigg Boss Kannada 11 Receives Notices(X)

Hyd, Oct 18:  టెలీవిజన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 11 కన్నడ విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కన్నడ బిగ్ బాస్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఈ షో నిర్వాహకులకు నోటీసులు జారీ అయ్యాయి. మహిళ కంటెస్టెంట్ల గోప్యతకు భంగం వాటిల్లిందని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభం నుంచే హౌస్ లో స్వర్గం- నరకం అనే కాన్సెప్ట్ నడుస్తోండగా ఇదే ఇప్పుడు సామాజిక కార్యకర్తలా ఆగ్రహానికి కారణమైంది. జైలు తరహా కడ్డీల వెనుక ఉంచగా తాగునీటి కోసం ఒక కుండ మాత్రమే ఉంచారు. ఆహారం, నీరు, ఆఖరికి బాత్ రూమ్ వెళ్లాలనుకున్నా స్వర్గంలో ఉన్న కంటెస్టెంట్ల అనుమతిని అడగాలి.

దీంతో బిగ్ బాస్ హౌస్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కర్ణాటక మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇష్టానికి విరుద్ధంగా ఏ వ్యక్తిని నిర్బంధంలో ఉంచలేమని, బిగ్ బాస్ హౌస్ లో పౌష్టికాహారం, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు కూడా కల్పించకుండా మానవ హక్కులను ఉల్లంఘించారని నాగలక్ష్మి ఆరోపించారు. ఇదే విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులకు రామనగరలోని కుంబాలఘోడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. Bigg Boss Tamil 8: ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే 

అలాగే న్యాయవాది సాగర్‌ సైతం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అక్టోబర్ 28న విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. అలాగే కన్నడ బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. అయితే అందరి నుండి విమర్శలు వస్తుండగా 'నరకం-స్వర్గం' కాన్సెప్ట్‌ను తీసేసి అందరిని కలిసి ఉండేందుకు అనుమతిచ్చారు నిర్వాహకులు. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలు రన్ అవుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఇప్పటికే ఏడో వారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోవడానికి వచ్చింది.