Actress Shree Rapaka: ప్రభాస్‌‌తో ఒక్క రోజైనా అంటున్న స్టార్ హీరోయిన్.., రెబల్ ప్టార్ పెళ్లి చేసుకునేంత వరకు నేను పెళ్లి చేసుకోనంటూ షాకింగ్ వ్యాఖ్యలు, డార్లింగ్ అంటే క్రష్‌ అంటున్న బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీరాపాక

ప్రభాస్‌ ఒప్పుకుంటే పెళ్లికి రెడీ అంటూ చాలామందే ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీరాపాక (Actress Shree Rapaka) తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Bigg Boss OTT Fame Shree Rapaka (Photo-Twitter)

ప్రభాస్‌ పెళ్లి అంశం ఇప్పుడు టాలీవుడ్ మొత్తంలో హాట్ టాఫిక్ అయింది. ప్రభాస్‌ ఒప్పుకుంటే పెళ్లికి రెడీ అంటూ చాలామందే ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీరాపాక (Actress Shree Rapaka) తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు తాను కూడా చేసుకోనంటూ (Comments on Her Marriage) షాకింగ్ వ్యాఖ్యలు చేసింది ఆర్జీవీ నగ్నం సినిమా హీరోయిన్

రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలో సందడి చేసిన ఈ భామ రెండోవారమే ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి వరస ఇంటర్య్వూలతో ఫుల్‌ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రభాస్‌ పెళ్లిపై (Prabhas Marriage) స్పందించింది. ప్రభాస్‌ను అభిమానిస్తున్న ఆమె ఆయన్ను కలిసే చాన్స్‌ మిస్‌ చేసుకున్నానంటూ వాపోయింది. ప్రభాస్‌ నటించిన ఈశ్వర్‌ మూవీ బాగా ఇష్టమని, అప్పటి నుంచి ప్రభాస్‌ అంటే క్రష్‌ అని చెప్పింది. మరి ఆయనను పెళ్లి చేసుకుంటారని అడగ్గా.. అంతకంటే అదృష్టమా అని సమాధానం ఇచ్చింది. అనంతరం ప్రుభాస్‌ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించిన చాలు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

రాంగోపాల్ వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్, స్వ‌లింగ సంప‌ర్కుల‌ను ఆ ధియేటర్లు అవ‌మానించాయంటూ వర్మ ట్వీట్

అయితే ఎలాగు అది జరగదు కాబట్టి ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్‌ చేస్తానని, ఆయన పెళ్లి తర్వాతే తను పెళ్లి పీటలు ఎక్కుతానంది. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోకపోతే తాను కూడా ఎప్పటికీ మ్యారేజ్‌ చేసుకోనని పేర్కొంది. కాగా శ్రీరాపాక హీరోయిన్‌ కంటే ముందు పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేసింది.