Dangerous: రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్, స్వలింగ సంపర్కులను ఆ ధియేటర్లు అవమానించాయంటూ వర్మ ట్వీట్
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు మంగళవారం భారీ షాక్ తగిలింది. వర్మ తాజా చిత్రం డేంజరస్‌ను ప్రదర్శించేందుకు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఈ విషయాన్ని స్వయంగా వర్మనే కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా తెలిపారు.
- Read in
- తెలుగు
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు మంగళవారం భారీ షాక్ తగిలింది. వర్మ తాజా చిత్రం డేంజరస్‌ను ప్రదర్శించేందుకు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఈ విషయాన్ని స్వయంగా వర్మనే కాసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కాగా ఇద్దరు మహిళల మధ్య స్వలింగ సంపర్కం నేపథ్యంలో డేంజరస్ చిత్రాన్ని వర్మ రూపొందించారు. నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రదర్శించలేమంటూ పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తేల్చి చెప్పేశాయి. తన సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుమతి లభించిన అంశాన్ని ప్రస్తావించిన వర్మ... ఈ రెండు సినిమా థియేటర్లు తన సినిమా ప్రదర్శనకు తిరస్కరించి స్వలింగ సంపర్కులను అవమానించాయంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
. @_PVRcinemas , @INOXCINEMAS refusing to screen my film KHATRA (DANGEROUS) becos it’s theme is LESBIAN ,and this after Supreme Court repealed section 377 and censor board already passed .it is a clear cut ANTI stand of their managements against #LGBT community pic.twitter.com/GxoHDH7Tjw
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 05, 2022 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

