Be The Real Man Challenge: తారక్ ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు. కేటీఆర్‌,రజినీకాంత్‌ల‌ను నామినేట్ చేసిన మెగాస్టార్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న బి ది రియల్‌ మ్యాన్‌ ఛాలెంజ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man Challenge) ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man) ఛాలెంజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌ అవుతోంది. తాజాగా హీరో ఎన్టీఆర్‌ (Jr NTR) నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) దానిని విజయవంతంగా పూర్తి చేశారు.

chiranjeevi accept jr ntr be the real man challenge and nominated ktr and rajinikanth (Photo-Twitter)

April 23: ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man Challenge) ట్రెండ్‌ కొనసాగుతుంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ (Be The Real Man) ఛాలెంజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌ అవుతోంది. #BeTheRealMan హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి లాక్ డైన్ వేళ సెలబ్రీటీలు తాము చేస్తున్న పనులను షేర్ చేస్తున్నారు. తాజాగా హీరో ఎన్టీఆర్‌ (Jr NTR) నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) దానిని విజయవంతంగా పూర్తి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో చిరంజీవి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చాలెంజ్‌లో భాగంగా ఇల్లు శుభ్రం‌ చేయడంతోపాటు తన తల్లి అంజనాదేవికి చిరు ఉప్మా పెసరట్టు వేసి పెట్టారు. ఈ సందర్భంగా అంజనాదేవి.. చిరుకు పెసరట్టు తినిపించారు.

ఈ చాలెంజ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ (KTR) ను, హీరో రజనీకాంత్‌ను (Rajinikanth) చిరంజీవి నామినేట్‌ చేశారు. ‘భీమ్‌(తారక్‌) ఇదిగో చూడు.. నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం. ఈ వీడియో సాక్ష్యం’ అని చిరు పేర్కొన్నారు.

Here's Chiranjeevi Konidela Tweet

లాక్ డౌన్ కారణంగా ఇంట్లో పనిమనుషులు రాక పోవడంతో ఇంట్లో ఆడవారికి సాయంగా ఉండాలనీ.. అంతేకాదు ఎవరైతే ఈ కష్టకాలంలో ఆడవారికి తోడుగా ఉంటారో వారే అసలైన మగవారని అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఓ వీడియోను షేర్ చేస్తూ రాజమౌళికి మొదటగా ‘బి ది రియల్ మెన్ ఛాలెంజ్’ విసిరాడు.

Here's Sandeep Reddy Vanga Tweet

దీంతో రాజమౌళి తన ఇల్లు శుభ్రం చేయడం.. ఇల్లు కడగడం లాంటీవి చేసి తారక్‌ను చరణ్‌ను నామినేట్ చేశాడు.

Here's  rajamouli ss Tweet

ఈ ఛాలెంజ్‌లో భాగంగా తారక్ ఇంటి పనులు చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా తాజాగా చరణ్ కూడా చెట్లకు నీరు పోయడం, బట్టల్నీ వాషింగ్ మిషిన్‌లో వేయడమే కాకుండా తన సతీమణి ఉపాసనకు చక్కగా ఓ కాఫీ కలిపి ఇచ్చాడు.

Jr NTR, Ram Charan Tweets

‘బీ ది రియల్ మెన్ ఛాలెంజ్‌లో భాగంగా బాబాయి బాలయ్యతో పాటు చిరంజీవి, వెంకటేష్. నాగార్జునతో కొరటాల శివకు నామినేట్ చేసారు. ఇందులో కొరటాల శివ ఇప్పటికే తన ఇంట్లో పనులు చేసారు. కొరటాల శివ విజయ్ దేవరకొండని నామినేట్ చేశారు. తారక్ విసిరిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన వెంకటేష్.. మహేష్ బాబు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడిలను నామినేట్ చేశారు.

 koratala siva, Venkatesh Daggubati Tweets

తాజాగా చిరంజీవి కూడా ఇంటిని వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసి..తన తల్లి గారైన అంజనమ్మకు ఇంట్లో దోష చేసి పెట్టి కొడుకుగా తల్లిపై తన ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు బి ది రియల్ మెన్ ఛాలెంజ్‌ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్‌ను నామినేట్ చేసారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now