IPL Auction 2025 Live

Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి వ్యాఖ్యలు, జనసేనకు సపోర్ట్ చేస్తారనే వార్తలకు ఈ కామెంట్లు బలం చేకూరినట్లేనా..

పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు

Chiranjeevi (Photo-Video Grab)

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, మాస్‌మహారాజ రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్‌ హైదరాబాద్‌లో ద్విశత దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ గతకొన్నేండ్లుగా సినీపరిశ్రమను చుట్టుముడుతున్న రాజకీయాంశాలను ప్రస్తావించారు.

మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలన్నారు. పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పుష్ప 2 విలన్ పాత్ర పోస్టర్ విడుదల చేసిన టీం, సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్న ఫహాద్ ఫాజిల్

ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు 2-3 వారాలు ఆడితే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వాల్తేరు వీరయ్య 200 రోజులు ప్రదర్శితమవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది, చరిత్రను మళ్లీ తిరగరాసినట్లుందని ఎమోషనల్‌ అయ్యారు. ఇక చిరంజీవి మరో మూడు రోజుల్లో భోళాశంకరుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. మెగాస్టార్‌ సోదరిగా కీర్తి సురేష్‌ కనిపించనుంది. సుశాంత్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ సినమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.

మెగాస్టార్ చిరంజీవి స్వయానా రాజకీయాల గురించి మాట్లాడడంతో గతంలో నాదెండ్ల మనోహర్ చెప్పినట్లు చిరంజీవి జనసేనకు సపోర్ట్ చేస్తారని వార్తలు నిజం చేకూర్చే లాగా ఆయ‌న మాట‌లు ఉన్న‌య‌ని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ మీటింగ్‌లో రోజుకు నా సినిమా రెమ్యూనరేషన్ రెండు కోట్లు అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.