Case Booked Against Jani Master: జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
తన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు నమోదయింది.
Hyderabad, Sep 16: తన డ్యాన్స్ స్టెప్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి నేషనల్ అవార్డు కూడా అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) అలియాస్ షేక్ జానీ భాషాపై రేప్ కేసు (Rape Case) నమోదయింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జానీపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు సమాచారం. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయింది. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద కేసులు పెట్టారు. ఈ కేసుపై రాయదుర్గం పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేయనున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలపై జానీ మాస్టార్ స్పందించాల్సి ఉంది.
అసలేం జరిగింది?
జానీ మాస్టార్ తనను లైంగికంగా వేధిస్తున్నారని జూనియర్ డ్యాన్సర్ ఒకరు ఫిర్యాదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో అక్కడికి కేసును బదిలీ చేసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలోనూ ఆరోపణలు
జానీ మాస్టర్ కు గతంలో నేర చరిత్ర కూడా ఉంది. 2015లో ఓ కళాశాలలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం జానీ మాస్టార్ బెయిల్ పై విడుదల అయ్యారు.