Hyd, Sep 15: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు మహేశ్ కుమార్ గౌడ్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడిగా 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడానని గుర్తు చేశారు.
ఇప్పుడు సీఎంగా మీ ముందు ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మహేశ్ కుమార్‌కు కీలక బాధ్యతలు ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు రేవంత్. తమ మీదికొస్తే ఒళ్లు చింతపండు అవుతుందని ...వాళ్లొస్తామన్నారు. మనమే వాళ్లింటికి పోయినం. మా మీదికొస్తే చింతపండైతది... మహేశ్ కుమార్ వెనుక నేనున్నా అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద బ్యాగ్ కలకలం, అనుమానాస్పద బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులు, బందోబస్తు మరింత పెంపు
Here's Video:
హరీష్ రావు దూలం లెక్క పెరిగిండు గాని దూడకు ఉన్న బుద్ది కూడా లేదని ఆరోజే చెప్పిన. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నడు.ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరాం. ఇప్పుడు హరీష్ రావును రాజీనామా చేయమంటే ఎక్కడో దాకున్నాడు : సీఎం రేవంత్ రెడ్డి. #RevanthReddy #HarishRao… pic.twitter.com/JHpfu9u3LR
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2024
హరీష్ రావు దూలం లెక్క పెరిగిండు గాని దూడకు ఉన్న బుద్ది కూడా లేదని ఆరోజే చెప్పిన... రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నడు.ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరాం అన్నారు. ఇప్పుడు హరీష్ రావును రాజీనామా చేయమంటే ఎక్కడో దాకున్నాడు అన్నారు రేవంత్.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కు శుభాభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటిరోజే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలు ఇప్పటివరకు 85 కోట్ల ప్రయాణాలు చేశారని ...ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.10 లక్షలు పెంచామని చెప్పారు.
Here's Video:
Live: Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in the Oath-taking Ceremony of Sri. Mahesh Kumar Goud as TPCC President https://t.co/APdwSHriT5
— Revanth Reddy (@revanth_anumula) September 15, 2024