Actress Hema Bail: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..
ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బెయిల్ లభించింది.
Bengaluru, June 13: బెంగళూరు (Bengaluru) రేవ్ పార్టీ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటోన్న తెలుగు నటి హేమకు (Actress Hema) ఊరట లభించింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న ఆమెకు బెయిల్ లభించింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు హేమకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది.
మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్
మా సభ్యత్వం రద్దు
రేవ్ పార్టీ కేసు విషయమై ఇటీవల విచారణకు హేమ హాజరవ్వగా.. కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఇదే కేసులో హేమకు బెయిల్ లభించడంతో ఆమెకు కాస్త ఊరట లభించినట్లయ్యింది.