CP Ravindra Press Meet: హీరో సాయి ధరమ్‌తేజ్‌‌పై త్వరలో ఛార్జ్‌షీట్‌, 91 CRPC కింద నోటీసులు ఇస్తే ఇంకా వివరణ ఇవ్వలేదని తెలిపిన సైబరాబాద్‌ సీపీ రవీంద్ర

సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది.

Cyberabad cp Stephen ravindra (Photo-Twitter)

సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌ గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో ప్రమాదానికి ( sai dharam tej bike accident) గురయిన సంగతి విదితమే. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్‌.. ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది.

ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో (CP Ravindra Press Meet) కమిషనర్‌ స్టీఫెన్ రవింద్ర మాట్లాడుతూ.. 'హీరో సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో త్వరలోనే సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తాం' అని సీపీ (Cyberabad CP Ravindra) వెల్లడించారు.