Kalki 2898 AD: జవాన్ సినిమా రికార్డును బ్రేక్ చేయనున్న కల్కి 2898 ఏడీ, మరో రూ.55 లక్షలు వసూలు చేస్తే దేశంలో అత్యధిక వసూల్లు కొల్లగొట్టిన సినిమాల్లో నాలుగో స్థానానికి ప్రభాస్ మూవీ
భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా 'కల్కి..' నిలిచింది.
టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్, రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 ఏడీ' మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా 'కల్కి..' నిలిచింది. ఇక భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూల్లు కొల్లగొట్టిన 'బాహుబలి2', 'కేజీఎఫ్2', 'ఆర్ఆర్ఆర్', 'జవాన్' తర్వాత ఐదో స్థానంలో 'కల్కి..' ఉంది. అంతేకాదు మరో రూ. 55 లక్షలు రాబడితే నాలుగో స్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ మూవీ 'జవాన్' ను కూడా ఈ సినిమా దాటేస్తుంది. కల్కీ మూవీ టికెట్ కేవలం రూ.100 మాత్రమే, దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన వైజయంతి మూవీస్
'జవాన్' మూవీ ఫుల్ రన్‌టైంలో రూ. 640.25 కోట్లు వసూలు చేయగా.. కల్కి ఇప్పటివరకు రూ. 639.70 కోట్లు రాబట్టింది. ఇందులో అధిక భాగం (రూ.414.85కోట్లు) మొదటి వారంలోనే వచ్చాయి. ఆగస్టు 15 వరకు 'కల్కి..' కలెక్షన్లు ఇలాగే స్టడీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పటివరకు పెద్ద చిత్రాలేవీ బాలీవుడ్‌లో విడుదల కావడం లేదు. ఆగస్టు 15న 'స్త్రీ2' సినిమా రానుంది.