Kalki Ticket For Rs 100 Only

Hyderabad, AUG 02: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టించిన చిత్రం ‘కల్కి 2898AD’ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ జూన్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. రూ.1100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడో ప్ర‌క‌టించింది. ఇక తాజాగా మూవీ యూనిట్ ఓ అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చింది.

 

కల్కి మూవీని రూ.100 కే చూడొచ్చున‌ని ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే కాదండోయ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేట‌ర్ల‌లో చూడొచ్చున‌ని చెప్పింది. అయితే.. ఈ ఆఫ‌ర్ ఆగ‌స్టు 2 నుంచి 9 వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అన్నా బెన్, మాళవిక నాయర్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీల‌క పాత్ర‌లు పోషించారు.