Devara Pre Release Event Cancelled: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం, అభిమానుల తాకిడితో నిర్వాహకులు ఏం చేశారో తెలుసా
ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు.
Hyderabad, SEP 22: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ దేవర. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కనున్నది. తొలిపార్ట్ ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఆదివారం హైదరాబాద్ హైఐసీసీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ప్రి రిలీజ్ ఈవెంట్‌కు (Devara Pre Release Event) జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పరిమితికి మంచి అభిమానులు రావడంతో తోపులాట చోటు చేసుకున్నది. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన వేదిక ఏమాత్రం సరిపోలేదు. ఒక్కసారిగా అభిమానులంతా లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఆరుబయటే వేలాది మంది అభిమానులు ఉండిపోయారు. మరో వైపు లోపల కార్యక్రమానికి వచ్చిన అతిథులు సైతం కూర్చునేందుకు వీలు లేకుండాపోయింది. పలువురు అభిమానులు ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నీచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.
Here's Tweet
పోలీసులు వెంటనే స్పందించి.. అభిమానులను బయటకు పంపించి వేశారు. అభిమానులను అదుపు చేయడం అసాధ్యమని భావించడంతో పోలీసులు హోటల్ నిర్వాహకులు, పోలీసులు ఈవెంట్‌ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించారు. తమ అభిమాన నటీనటులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. సరైన ఏర్పాట్లు, వసతులు కల్పించకపోవడంపై పలువురు అభిమానులు మేకర్స్‌పై మండిపడుతున్నారు. వాస్తవానికి మేకర్స్ ఈవెంట్ నిర్వహించే విషయంపై చర్చించినట్లు సమాచారం. మేకర్స్ ప్రయత్నాలు మాత్రం విఫలమయ్యాయి. అయితే, వేదిక వద్దకు చిత్రబృందం రాక ముందే పరిస్థితి ఇలా ఉంటే.. వస్తే కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదని.. ఈ విషయంలో ఆలోచన చేసుకోవాలని మేకర్స్‌కు పోలీసులు స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. దాంతో ఏం చేసేది లేక క్యాన్సిల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.