Disha Patani First Look: కల్కి నుంచి మరో అప్ డేట్, రాక్సీని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల, రఫ్ లుక్ లో దిశా పటాని పోస్టల్ రిలీజ్
ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
Hyderabad, June 13: ప్రభాస్ కల్కి (Kalki 2898 AD) సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల వచ్చిన కల్కి సినిమా ట్రైలర్ (Kalki Trailer) చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ట్రైలర్ లో చాలా మంది ఆర్టిస్టులని చూపించారు. కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ (Amitab), కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ పేర్లు రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు దిశా పటాని (Disha Patani First Look) పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ టీమ్ నుంచి బర్త్ డే విషెష్ చెప్తూ తన క్యారెక్టర్ పేరు రాక్సీ అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
ఆల్రెడీ కల్కి ట్రైలర్ లో దిశా పటాని ఫైట్ చేస్తున్నట్టు ఒక షాట్ కూడా చూపించారు. సినిమాలో ప్రభాస్ కి దిశా లవర్ అని తెలుస్తుంది. అలాగే ఫైట్స్ కూడా చేయబోతోందని తెలుస్తుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ఈ బాలీవుడ్ భామ కల్కి సినిమాలో రాక్సీ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.