Diwali Celebrations: పండుగ రోజున సంజయ్ దత్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన మోహన్ లాల్, మున్నాభాయ్ ఇంట్లో దీపావళి వేడుకలకు హాజరు, సంజయ్, మాన్యతా నా స్నేహితులు అంటూ ట్వీట్
నేరుగా వారి ఇంటికి వెళ్లి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ఆయన భార్య మాన్యతా దత్ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోగా ఈ వేడుకలలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohanlal) కూడా భాగం అయ్యారు.
బాలీవుడ్ స్టార్, మున్నాభాయ్.. సంజయ్ దత్ కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడి కోలుకున్న సంగతి విదితమే. తన పిల్లలైన షహ్రాన్, ఇక్రాల పుట్టినరోజు నాడు క్యాన్సర్‌ని జయించానని పొడవైన పోస్ట్ పెట్టి అభిమానులని ఆనందింపజేశాడు. తమ అభిమాన నటుడు మున్నాభాయ్ (Sanjay Dutt) క్యాన్సర్‌ను జయించి తిరిగి మామూలు మనిషిగా మారడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.
ఈ నేపథ్యంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మున్నాభాయ్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ (Mohanlal -Sanjay Dutt Ring) ఇచ్చారు. నేరుగా వారి ఇంటికి వెళ్లి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, ఆయన భార్య మాన్యతా దత్ ముంబైలోని తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోగా ఈ వేడుకలలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohanlal) కూడా భాగం అయ్యారు.
సంప్రదాయమైన దుస్తులు ధరించి వారంతా ఫొటోలు దిగారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మోహన్‌లాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ‘సంజయ్, మాన్యతా నా స్నేహితులు’ అని కాప్షన్ జతచేశారు. ఈ ఫొటోల్లో సంజయ్ దత్త్, మోహన్‌లాల్ ఒకరికొకరు నమస్కరించుకొని పలకరించుకోవటం, సరదాగా మాట్లాడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Here's Tweet
ఇక సంజయ్ దత్ కన్నడ కేజీఎఫ్-2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మోహన్‌లాల్ దృశ్యం-2 రెండో విడత షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం మోహన్‌లాల్ దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. త్వరలో ఐపీఎల్ లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తుంది.