DMDK Founder, Actor Vijayakanth Passes Away: ప్రముఖ నటుడు కెప్టెన్ విజయకాంత్ ఇకలేరు.. కరోనాతో మృతిచెందిన డీఎండీకే వ్యవస్థాపకుడు
కరోనా బారిన పడిన ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో దవాఖానలో చేరారు.
Chennai, Dec 28: తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) (71) మరణించారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి (Breathing issues) ఆయన ఇబ్బంది పడుతుండటంతో ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ మేరకు డీఎండీకే పార్టీ (DMDK) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే, ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికితోడు తాజాగా కరోనా సోకడంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారి చివరకు లోకాన్ని వీడారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
27 ఏళ్ల వయసులో తెరంగేట్రం
విజయకాంత్ 1952 ఆగస్టు 25న మధురై (తమిళనాడు)లో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్ ఇలమై’ (Inikkum Ilamai) (1979). ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారాయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు.