Harvey Weinstein: హోటల్ గదిలో 80 మంది హీరోయిన్లపై ప్రముఖ నిర్మాత అత్యాచారం, 16 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు, ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌

పదేళ్ల కిత్రం యూరోయపిన్‌ నటిపై బెవర్లీ హిల్స్‌ హోటల్‌ గదిలో అత్యాచారానికి పాల్పడినందుకు లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

Harvey Weinstein (Photo Credits: Twitter)

హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌(70) లైంగిక వేధింపుల వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పదేళ్ల కిత్రం యూరోయపిన్‌ నటిపై బెవర్లీ హిల్స్‌ హోటల్‌ గదిలో అత్యాచారానికి పాల్పడినందుకు లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.

ఇప్పటికే లైంగిక వేధింపుల తరహా కేసుల్లో న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న వేన్‌స్టీన్‌ తాజా తీర్పుతో మరో 16 ఏళ్లపాటు జైల్లో గడపనున్నారు. వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరైన 70 ఏళ్ల ఆస్కార్ అవార్డు గ్రహీత.. దయచేసి తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్నాడు.

వీడియో ఇదే.. చావుకు దగ్గరగా వెళ్లిన హీరో విశాల్, అదుపుతప్పి వేగంగా వచ్చిన ట్రక్కు, హీరో పక్క నుంచే వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న యూనిట్

అయితే అతన్ని వాదనలు పట్టించుకొని న్యాయమూర్తి లిసా లెంచ్‌.. అత్యాచారానిక పాల్పడినందుకు మొత్తం 16 సంవత్సరాల పాటు మరో మూడు శిక్షలు విధించారు. కాగా 2013లో నటి, మోడల్‌పై హార్వే వేన్‌స్టీన్‌ అత్యాచారానికి పాల్పడినట్లు గత డిసెంబర్‌లోనే లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే.

హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్‌ నటీమణులు, మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్‌, జెన్నిఫర్‌ ఐన్‌స్టన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఈ ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీశాయి.