Youtuber Arrest: బర్త్ డే వేడుకల కోసం పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డ య్యూటూబర్, పక్కింటి కుర్రాడుగా ఫేమస్ అయిన చంద్రశేఖర్ అరెస్ట్

ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు వేడుక‌ల‌కు త‌న‌ను ఆహ్వానించి లైంగిక దాడికి (rape) పాల్ప‌డిన‌ట్లు యువ‌తి ఫిర్యాదులో పేర్కొంది. 2021 ఏప్రిల్ 25న ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిపింది.

Youtuber Chandrasekhar Sai Kiran (PIC@ X)

Hyderabad, DEC 15: నార్సింగి పోలీసులు ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ సాయికిర‌ణ్‌ను (Chandrasekhar Sai Kiran) అరెస్ట్ చేశారు. ఓ యువ‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పుట్టిన రోజు వేడుక‌ల‌కు త‌న‌ను ఆహ్వానించి లైంగిక దాడికి (rape) పాల్ప‌డిన‌ట్లు యువ‌తి ఫిర్యాదులో పేర్కొంది. 2021 ఏప్రిల్ 25న ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలిపింది. అంతేకాకుండా త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేసిన‌ట్లు పేర్కొంది. ఈ క్ర‌మంలో యూట్యూబ‌ర్ చంద్ర‌శేఖ‌ర్‌తో పాటు అతడి త‌ల్లిదండ్రులు, మ‌రో ఇద్ద‌రి పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుడు చంద్ర‌శేఖ‌ర్ ను (Chandrasekhar Sai Kiran Arrest) రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

Pedro Henrique Dies: వీడియో ఇదిగో, స్టేజ్ మీద పాట పాడుతూనే కుప్పకూలిన ప్రముఖ సింగర్, ఆస్పత్రికి తీసుకువెళ్లే లోగానే బ్రెజిల్ గోస్పెల్ సింగర్ పెడ్రో హెన్రిక్ మృతి 

కాగా.. ప‌క్కింటి కుర్రాడు పేరుతో కొంత‌కాలం క్రితం చంద్ర‌శేఖ‌ర్ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. స‌ర‌దాగా, సందేశాత్మ‌క వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అత‌డి ఛానెల్‌కు 13 ల‌క్ష‌ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబర్‌గా వ‌చ్చిన గుర్తింపుతో సాయికిరణ్ పలు సినిమాలలో నటించాడు.



సంబంధిత వార్తలు

Bandi Sanjay Slams KTR:  తెలంగాణలో 'ఆర్‌ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్

Actor Kasturi Arrested: న‌టి క‌స్తూరి అరెస్ట్, హైద‌రాబాద్ లో అదుపులోకి తీసుకొని చెన్నైకి త‌ర‌లిస్తున్న‌ త‌మిళ‌నాడు పోలీసులు

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్