Kathi Mahesh Health Update: వెంటిలేటర్‌పై కత్తి మహేష్, రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో చెన్నైకు తరలింపు, ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమంటున్న వైద్యులు
ప్రమాదం నుంచి సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే మహేష్‌కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌కు (Kathi Mahesh Health Update) గాయాలయిన విషయం విదితమే. ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. మహేష్ తన స్నేహితుడు సురేష్‌తో కలిసి విజయవాడ నుంచి తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యర్రవారిపాలేనికి శుక్రవారం రాత్రి ఇన్నోవా కారులో బయలుదేరారు.
చంద్రశేఖరపురం వద్ద ముందు వెళుతోన్న కంటైనర్‌ను శని వారం తెల్లవారుజామున 2.30 గంటలకు కారు ఢీకొంది. ఆ సమయంలో మహేష్ స్నేహితుడు కారును డ్రైవ్ చేస్తున్నారు. ఘటనలో మహేష్‌కు కంటి భాగంలో తీవ్ర గాయమైంది. ఆయనను (Telugu actor Kathi Mahesh) హైవే మొబైల్ పోలీసులు నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదం నుంచి సురేష్ సురక్షితంగా బయటపడ్డారు.
అయితే మహేష్‌కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా, తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో కత్తి మహేశ్ కారు నుజ్జు, నుజ్జు అయింది. ప్రస్తుతం స్పెషల్ ఇసోలేషన్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స (Film critic Kathi Mahesh In ICU) అందిస్తున్నారు వైద్యులు.
పవన్ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్ పాపులర్ అయ్యారు. రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయన హైదరాబాద్ నగర బహిష్కరణకు కూడా గురయ్యారు