K Viswanath No More: విశ్వనాథ్ మరణంతో శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ, అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపిన టాలీవుడ్, కళా తపస్వికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
విశ్వనాథ్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న (K Viswanath No More) వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ (K Viswanath passed Away) ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు
కళాతపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఇక లేరన్న (K Viswanath No More) వార్త తెలిసి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ (K Viswanath passed Away) ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ నివాసానికి చేరుకొని ఆయన పార్థీవదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతిపై సినీ నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ అని బాలకృష్ణ అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు.సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Here's ANI Tweet
జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ... 'తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, కేసీఆర్, జగన్, చంద్రబాబు
మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని అన్నారు. పితృ సమానులైన ఆయన ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆయన గొప్పదనాన్ని చెప్పటానికి మాటలు చాలవని అన్నారు. పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైనదని చెప్పారు. ఇంకా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఇతర సినీ తారలు నివాళులర్పించారు.
కన్నుమూసిన కళా తపస్వి కె. విశ్వనాథ్, దివికేగిన శంకరాభరణం, శివైక్యమైన స్వాతిముత్యం..
ఇక సినీ పరిశ్రమ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటోంది.ఈ నేపథ్యంలోనే కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా సినిమా నేడు జరగనున్న అన్ని షూటింగులు బంద్ చేస్తున్నట్లు తెలిపింది. స్వచ్చందంగానే షూటింగులను నిలిపివేసినట్లు తెలిపింది.