Hyderabad, Feb 3: ప్రముఖ దర్శకుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కె విశ్వనాథ్ (K. Vishwanath) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ (Tollywood) మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు కేసీఆర్ (KCR), జగన్ (Jagan), టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నుమూసిన కళా తపస్వి కె. విశ్వనాథ్, దివికేగిన శంకరాభరణం, శివైక్యమైన స్వాతిముత్యం..
అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని కేసీఆర్ కొనియాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కారం వారి దర్శక ప్రతిభకు నిదర్శనమని అన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజుల విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని చెప్పారు.
అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తాం.. అయోధ్యవాసికి ఆగంతకుడి ఫోన్.. పోలీసుల దర్యాప్తు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ... విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారని కొనియాడారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయని అన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని చెప్పారు.
నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. వాడీవేడి చర్చకు అధికార, విపక్షాలు సిద్ధం
టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ... ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని చెప్పారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. విశ్వనాథ్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
Saddened by the passing away of Shri K. Viswanath Garu. He was a stalwart of the cinema world, distinguishing himself as a creative and multifaceted director. His films covered various genres and enthralled audiences for decades. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 3, 2023
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని సీఎం అన్నారు. pic.twitter.com/5nZmJpsDIV
— Telangana CMO (@TelanganaCMO) February 3, 2023
విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు.#KVishwanath pic.twitter.com/XKAq2E68yn
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 2, 2023
ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. pic.twitter.com/1hMIAFfUSp
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2023