Godfather: రూ.57 కోట్లకు గాడ్‌ఫాదర్‌ డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్‌, దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానున్న సినిమా

తెలుగు, హిందీ కలిపి నెట్‌ఫ్లిక్స్‌ రూ.57కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Superstar Salman Khan joins the sets of Chiranjeevi's 'Godfather'!(Photo-Twitter)

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). ఇందులో నయనతార, సత్యదేవ్‌, సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరాకు విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్‌ బిజినెస్‌ పూర్తి కాగా, తాజాగా ఓటీటీ రైట్స్‌ అధిక ధరకు (Netflix For This Huge Amount) విక్రయమయ్యాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్‌ రైట్స్‌ను (Godfather OTT Rights) దక్కించుకుంది. తెలుగు, హిందీ కలిపి నెట్‌ఫ్లిక్స్‌ రూ.57కోట్లు చెల్లించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather) ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసే పనిలో ఉంది చిత్ర బృందం.

ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఎలా ఉందో చూశారా, ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్

మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటించిన మలయాళ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్‌’ వస్తోంది. చిరంజీవి స్టార్‌డమ్‌కు సరిపోయేలా మోహన్‌రాజా కథలో చిన్న చిన్న మార్పులు చేశారు. అదనపు ఆకర్షణ తీసుకొచ్చేందుకు మలయాళంలో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌తో చేయిస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనున్నారు. ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నారు.



సంబంధిత వార్తలు