Nagarjuna About Demolition Of N Convention : N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున, కోర్టు ఆదేశాలకు విరుద్దంగా కూల్చివేత,ఒక్క అంగుళం కూడా ఆగ్రమించలేదు
స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు...ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని తేల్చిచెప్పారు.
Hyd, Aug 24: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించారు హీరో నాగార్జున. స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేతలు చేపట్టడం బాధాకరం అన్నారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు...ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది అని తేల్చిచెప్పారు.
కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసిందని, స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని తెలిపారు. ఇవాళ ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు అన్నారు నాగార్జున. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు అని సూచించారు.
అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసి నాగార్జున ఎన్-కన్వెన్షన్ హాల్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారించిన హైడ్రా...ఇవాళ ఉదయం అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత చేపట్టారు. హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)
Here's Tweet:
హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కులు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాల కూల్చివేతను కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం వ్యతిరేకించారు. అయితే ఇవేమి పట్టించుకోని రంగనాథ్ తాజాగా ఎన్ కన్వెన్షన్‌పై కొరఢా ఝుళిపించారు. త్వరలో కేటీఆర్‌కి చెందిందిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేత ఖాయమనే ప్రచారం జరుగుతోంది.