Hyderabad, Aug 24: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు (Hero Nagarjuna) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతున్నది. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసి నాగార్జున ఎన్-కన్వెన్షన్ హాల్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎన్-కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని తేల్చిన అధికారులు నేటి ఉదయం కూల్చివేత పనులు ప్రారంభించారు.
హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా
హైదరాబాద్ - మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభం.. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తిమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు..
మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్… pic.twitter.com/zAAXVRpYku
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024
గతంలో ఆగిపోయి..
హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ చేసింది. నగరంలో ఆక్రమణల తొలిగింపు పైన దూకుడుగా వ్యవహరిస్తున్నది. . కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. కాగా, నాగార్జున ఎన్-కన్వెన్షన్ సెంటర్ పై గతంలోనే ఈ రకమైన ఫిర్యాదులు ఉన్నా..అప్పట్లోనే కూల్చివేస్తారనే ప్రచారం జరిగినా..చివరి నిమిషంలో కూల్చివేతలు ఆగిపోయాయి.