Nayanthara: ఆడియో ఫంక్షన్లకు హాజరైనా హీరోయిన్లను ఏ మూలనో నిలబెడతారు.. అందుకే నేను ఈవెంట్స్ కు హాజరవ్వను.. నయనతార షాకింగ్ కామెంట్స్
హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని... అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది.
Hyderabad, Dec 24: సినీపరిశ్రమలో (Movie Industry) ఉండే అసమానతల గురించి అగ్ర కథానాయిక నయనతార (Nayanatara) స్పందించింది. హీరోలకు (Heroes) ఇచ్చేంత ప్రాధాన్యతను (Importance) హీరోయిన్లకు ఇవ్వరని... అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది. తాను హీరోయిన్ గా రెండో దశాబ్దంలోకి ప్రవేశించిన తర్వాత తనకంటూ కొన్ని కలలు ఉండేవని... మహిళా ప్రాధాన్యత ఉండే సినిమాలు చేయాలనే కోరిక ఉండేదని చెప్పింది.
అయితే ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేకపోయేవారో అర్థమయ్యేది కాదని తెలిపింది. హీరోయిన్లు ఏదైనా ఆడియో ఫంక్షన్ కు హాజరైనా మమ్మల్ని ఏ మూలనో నిలబెట్టే పరిస్థితి ఉండేదని చెప్పింది. ఈ కారణాల వల్లే తాను సినిమా ఈవెంట్లకు వెళ్ళడం మానేశానని తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.