Anjan Kumar Yadav (photo-Congress Party)

Hyd, Feb 24: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav) మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినందుకే తెలంగాణలో కుల గణన సర్వే ఈ రేవంత్ ప్రభుత్వం నిర్వహించిందని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. లేకుంటే వీళ్లు ఈ సర్వేనే చేసే వారు కాదని ఆయన స్పష్టం చేశారు.

అందుకే యాదవుల తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఆమె పాత్ర ఏం లేదు అన్నవాళ్లు ఇవాళ కులగణను తప్పుల తడక అంటే ఎవరు నమ్ముతారు అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి బిహార్ మాజీ సీఎం లూలూ ప్రసాద్ యాదవ్ చెప్పినందుకే తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కిందని ఆయన పేర్కొన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే

తనకు ఈ పదవి దక్కకుండా చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అడ్డు తగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కేంద్ర మంత్రి కాకుండా వీళ్లే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ పార్లమెంట్(Secunderabad Parliament) ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాంగ్ డిసిషన్ తీసుకున్నది.

Anjan Kumar Yadav Slams Congress Party leaders

నిజానికి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ యాదవు(Yadav)లకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేది. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారు. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. తన కొడుకు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చింది. తనకు నేరుగా సోనియా, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పడంతోనే పీసీసీలో చోటు ఇచ్చారని అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయే సమయంలో తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని.. గెలిచే టైంలో మాత్రం తనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా పోటీ చేస్తారని.. మరి జీవన్ రెడ్డి ఒడిపోయాడని.. ఆయనకు ఎంపీగా టిక్కెట్ మళ్లీ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఇంట్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చిన సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి చేజేతులా సీటు కోల్పోయేలా చేశారంటూ దానం నాగేందర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భజన సంఘాలు వచ్చాయని వ్యంగ్యంగా పేర్కొన్నారు. తమకు ప్రాధాన్యత లేకుంటే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రేవంత్ సారథ్యంలోని పార్టీలోని కీలక నేతలను అంజన్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్ళు (రెడ్లు) ఇవ్వలేదన్నారు.