Hydarabadi Movies: హైదరాబాదీ సినిమాలు చూస్తారా? ఏక్ దమ్ లోకల్ మాల్! మస్త్ కామెడీతో మీ దిల్ ఖుష్ చేసే సినిమాలు ఇవి.
పక్కా లోకల్ సినిమాలు అన్నమాట...
హైదరాబాదీ సినిమాలు చూస్తారా? హైదరాబాదీ సినిమాలు అంటే టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు కాదు. వీటి కథా - కార్ఖానా మొత్తం అలగ్. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే కాస్ట్ లీ సినిమాలు కావివి, పాతబస్తీ దక్కనీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తయారయ్యే ఖతర్నాక్ సినిమాలు ఇవి. పక్కా లోకల్ సినిమాలు అన్నమాట. ఈ సినిమాలకు, సినిమాలో నటించే ఆర్టిస్టులకు స్టార్ డమ్ హైదరాబాదులోనే కాదు, హిందీ సినిమాలు చూసే బాలీవుడ్ బ్యాచ్ కూడా ఇష్టంగా చూస్తారు. సినిమాలోని మాటలన్నీ అచ్చంగా తెలంగాణ- హైదరాబాద్ యాసలోనే ఉంటాయి. యాక్టర్స్ హిందీ- ఉర్దూ- తెలుగు ఏ భాషలో అయినా మాట్లాడతారు. ఈ సినిమాల్లో వాడే కొన్ని పంచ్ డైలాగ్స్ బైగన్, భాడకవ్, మాకి కిరికిరి, కుందల్ కుందల్ మారా లాంటి పదాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
2005 లో ద అంగ్రేజ్ సినిమాతో ఈ హైదరాబాదీ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్పట్లో వచ్చిన ది అంగ్రేజ్ మూవీ సూపర్ హిట్, ఇప్పటికీ ఈ మూవీ చాలా మందికి ఫేవరెట్. ఈ సినిమాలతోనే టాలీవుడ్ లో కూడా కొంత మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. హీరో నిఖిల్ కూడా టాలీవుడ్ లో హీరో అవ్వకముందు ఈ 'హైదరాబాద్ నవాబ్స్' సినిమాలలో చిన్న రోల్ లో కనిపించాడు.
ఇప్పటివరకూ వచ్చిన కొన్ని హైదరాబాదీ సినిమాలు.
The Angrez
Hyderabad Nawabs
The Angrez- 2
Fun aur Masti
Salam Zindagi
House full auto wala