Hyper Aadi In Jabardasth: హైపర్ ఆదికి వెంటాడుతున్న భయం అదేనా, సుడిగాలి సుధీర్ కు పట్టిన గతే పడతుందా, ఆదికి మల్లెమాల షాక్ ఇచ్చిందా..

హైపర్ ఆది తాజాగా ధమాకా సినిమాలో రావు రమేష్ పక్కన అసిస్టెంట్ గా కామెడీ బాగా పెరగడంతో, థియేటర్లలో నవ్వులు వెల్లి విరుస్తున్నాయి.

Jabardasth comedian Hyper Aadi (Photo-Facebook)

జబర్దస్త్ ద్వారా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హైపర్ ఆది,  ప్రస్తుతం ధమాకా సినిమా తర్వాత సూపర్ హిట్ స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. హైపర్ ఆది  తాజాగా  ధమాకా సినిమాలో రావు రమేష్ పక్కన  అసిస్టెంట్ గా కామెడీ బాగా పెరగడంతో,  థియేటర్లలో నవ్వులు వెల్లి విరుస్తున్నాయి. అయితే హైపర్ ఆది ప్రస్తుతం  సినిమా అవకాశాలు వరుసగా వస్తున్నాయి.  పెద్ద హీరోల పక్కన సైతం కమెడియన్గా హైపర్ ఆది బెటర్  చాయిస్ గా కనిపిస్తున్నాడు. అయితే హైపర్ ఆది మాత్రం అటు సినిమా చాన్సులు, జబర్దస్త్ మధ్య  నలిగిపోతున్న ట్లు తెలుస్తోంది.  ఎందుకు పెద్దపెద్ద హీరోల పక్కన  కమెడియన్ గా చేయాలంటే,  చాలా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పెద్ద హీరోల షూటింగులు నెలల తరబడి జరుగుతుంటాయి.  అదే సమయంలో జబర్దస్త్ షూటింగ్ సైతం రెగ్యులర్ గా ఉంటుంది.  ఆ సమయంలో హైపర్ ఆది రెండింటిలో దేన్నీ ఎంపిక చేసుకోవాలో,  అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. 

ఎందుకంటే ఒక పెద్ద హీరో కాంబినేషన్ లో సినిమా చేయాలంటే,  ఎప్పుడు వుంటుందో తెలియదు.  అదే సమయంలో జబర్దస్త్ సైతం నెలకు కనీసం రెండు షెడ్యూల్స్ ఉంటాయి.  జబర్దస్త్ వదిలి వెళ్ళాలంటే  మామూలు విషయం కాదు.  మల్లెమాల కాంట్రాక్టర్ బ్రేక్ చేసి వెళ్లాల్సి ఉంటుంది.  ఇప్పటికే మల్లెమాల కాంట్రాక్టును బ్రేక్ చేసిన  సుడిగాలి సుదీర్,  అదిరే అభి,  చమ్మక్ చంద్ర  లాంటి  కమెడియన్ల  పరిస్థితి  ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  హైపర్ ఆది జబర్దస్త్ లో ఉన్నంత కాలం  ఒక స్టార్ గా వెలిగి పోవడం ఖాయం.  కానీ సినిమా ఇండస్ట్రీలో  అవకాశాలు  ఎల్లకాలం ఒకేలా ఉండవు. ఓ రకంగా రిస్కు అనే చెప్పాలి. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో 5గురికి నోటీసులు, విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన సిట్

ఈ రిస్కును భరించే శక్తి హైపర్ ఆది ఉందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.  అటు హైపర్ ఆది మాత్రం వన్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  కానీ ఇటీవల ఓ పెద్ద హీరో సినిమాలో హైపర్ ఆదికి చాన్స్ వచ్చినప్పటికీ,  మల్లెమాల కాంట్రాక్ట్ కు భయపడి డేట్స్ వదులుకున్నట్లు  కాంట్రాక్టు తెలుస్తోంది. 

మొత్తానికి హైపర్ ఆది కి మల్లెమాల గట్టి షాకే ఇచ్చింది. అటు హైపర్ ఆది కి మల్లెమాల నుంచి  భారీగా పారితోషికం అందకపోవచ్చు.  కానీ ఇమేజ్ మాత్రం గట్టిగానే ఉంది.  శ్రీదేవి డ్రామా కంపెనీ,  డి డాన్స్ షో, జబర్దస్త్ లాంటి షోలతో హైపర్ ఆదికి సంవత్సరం పొడువుగా పని దొరుకుతోంది. అడపాదడపా  ఈవెంట్స్ కూడా చేస్తున్నాడు.  బయట ఈవెంట్స్ కు హైపర్ ఆది లక్షల్లో చేస్తాడు అనే పేరు ఉంది. సినిమాల్లో కూడా రెమ్యూనరేషన్ భారీగానే ఉంటుంది.  కానీ డేట్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది.  ఇదే ప్రస్తుతం హైపర్ ఆది సమస్యగా మారింది. అటు జబర్దస్త్ లో ఉండాలా, లేక వదిలేసి  సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్లి పోవాలో తేల్చుకోవాల్సి ఉంది.



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.