K. Viswanath Wife Passes Away: కళాతపస్వి కె.విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం.. విశ్వనాథ్ అర్ధాంగి కన్నుమూత.. ఈ నెల 2న కె.విశ్వనాథ్ మృతి
ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నిన్న ఆయన అర్ధాంగి జయలక్ష్మి (86) తుదిశ్వాస విడిచారు. జయలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు.
Hyderabad, Feb 27: కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ (K. Viswanath) కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ నెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూయగా, నిన్న ఆయన అర్ధాంగి జయలక్ష్మి (86) (Jayalakshmi) తుదిశ్వాస విడిచారు. కె.విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, కొన్నిరోజుల వ్యవధిలోనే కె.విశ్వనాథ్ దంపతులు ఈ లోకాన్ని వీడడం వారి కుటుంబ సభ్యులను మరింత విచారానికి గురిచేస్తోంది.