Kangana Ranaut: ఆ హీరో వల్లే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్‌

సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఓ బాలీవుడ్‌ హీరోనే (Kangana Ranaut Blames 'Bollywood Superstar)కారణమంటూ షాకింగ్‌ పోస్ట్‌ చేసింది.

Kangana Ranaut (Image source: Instagram)

అక్కినేని నాగ చైతన్య సమంత జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ హీరోయిన్ కంగనా రనౌత్‌(Kangana Ranaut) మరో ఆసక్తికర చర్చకు తెర లేపింది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఓ బాలీవుడ్‌ హీరోనే (Kangana Ranaut Blames 'Bollywood Superstar)కారణమంటూ షాకింగ్‌ పోస్ట్‌ చేసింది. ‘10 ఏళ్లుగా ప్రేమ బంధంలో ఉండి, నాలుగేళ్లుగా వివాహా బంధంలో ఉండి.. విడాకులు తీసుకున్న ఓ సౌత్‌ ఇండియా హీరో.. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోతో పరిచయమ్యారు.

ఆ బాలీవుడ్‌కు హీరో విడాకుల స్పెషలిస్ట్‌గా పేరుంది. అతను ఎంతోమంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. ఆయన సూచనలు, సలహాల మేరకే సౌత్‌ హీరో విడాకుల నిర్ణయం తీసుకున్నాడు’అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో కామెంట్‌ చేసింది. దీంతో పాటు ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై కూడా కంగనా కామెంట్‌ చేసింది.

ఎవరి దారి వారిదే ఇక, విడాకులు తీసుకున్న సమంత-నాగ చైతన్య, విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని వెల్లడి

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమిర్‌ ఖాన్‌ను ఉద్దేశించే కంగనా ఆ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. కాగా, నాగచైతన్య ఇటీవల బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌తో కలిసి లాల్‌ సింగ్ చద్దా అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.