IPL Auction 2025 Live

Kangana Ranaut: అకౌంట్ సస్పెండ్, ట్విట్టర్‌పై విరుచుకుపడిన కంగనా రనౌత్‌, తెల్ల తోలు ఉన్నోళ్లు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారంటూ విమర్శ, సినిమాల ద్వారా గొంతును వినిపిస్తానని తెలిపిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌

నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు (Kangana Ranaut Twitter suspended) చేసింది. ట్విట్టర్‌లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kangana Ranaut (Photo Credits: Twitter)

ఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉండే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్‌ (Kangana Ranaut's Twitter account suspended) చేసిన సంగతి విదితమే. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు (Kangana Ranaut Twitter suspended) చేసింది. ట్విట్టర్‌లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా ట్విట్టర్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘తెల్లతోలు ఉన్నవారు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారు’’ అంటూ ట్విట్టర్ యాజమాన్యంపై మాటల దాడి చేశారు. సస్పెన్షన్ తర్వాత మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అకౌంట్ ఇది కాకుంటే మరెన్నో మార్గాలు ఉన్నాయని, నా వాయిస్ ని చెప్పడానికి ఇతర మార్గాలు అనేకం ఉన్నాయని ఆమె తెలిపారు.

ట్విట్టర్ మీద బాలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గోధుమ రంగు శరీరం ఉన్నవారిని తెల్లతోలు ఉన్నవారు బానిసలుగా చూస్తారు. ట్విట్టర్ అదే నిరూపించింది. ఎందుకంటే ట్విట్టర్ యాజమాన్యం అమెరికాకు చెందింది. మనమేం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో వాళ్లే నిర్ణయించాలనుకుంటారు. ట్విట్టర్ పోతేనేమి..? నాకు వేరే సామాజిక మాధ్యమాలు (I Have Many Platforms to Use) ఉన్నాయి. అందులో నా గొంతును వినిపిస్తానని తెలిపారు.

బెంగాల్‌లో భారీ హింసాకాండ, ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, రేపు దేశ వ్యాప్త ధర్నా చేయనున్న బీజేపీ, మే 5న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మమతాబెనర్జీ

నేను నటిని. సినిమాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాను. ఈ దేశంలో కూడా కొంత మంది ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బానిసలుగా చూడబడుతున్నారు. ఇప్పటికీ వారికి విముక్తి దొరకలేదు. వారికోసం మాట్లాడతాను’’ అని కంగనా రనౌత్ అన్నారు.

ముంబై ఓ మినీ పాకిస్తాన్, కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు, ఆమె ఓ మెంటల్ కేసు అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్

కాగా కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఆమె వరుసగా వివాదాస్పద ట్వీట్లు చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఆఫ్‌లైన్‌లో హింసకు దారి తీసే అవకాశం ఉన్న ప్రవర్తనపై చర్య తీసుకోవడంలో తాము స్పష్టంగా ఉన్నట్లు ట్విట్టర్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

కాగా వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై కంగ‌నా అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమెను ఓ రాక్ష‌సిగా అభివ‌ర్ణించారు. ప‌శ్చిమ బెంగాల్‌లో వెంట‌నే రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆమె డిమాండ్ చేసింది. అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ గెలిచినా అక్క‌డ హింస చెల‌రేగ‌లేద‌ని, ప‌శ్చిమ బెంగాల్‌లో మాత్రం టీఎంసీ హింస‌కు దిగుతోంద‌ని కంగ‌నా ట్వీట్ చేసింది. బెంగాల్ మంట‌ల్లో కాలిపోతోందంటూ కంగ‌నా ట్వీట్ చేయ‌డంపై ట్విట‌ర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. త‌న ట్వీట్ల‌లో ఇందిరా గాంధీపై కూడా ఆమె ప‌లు కామెంట్లు చేసింది.