Case on Fahadh Faasil: ఆస్ప‌త్రిలో షూటింగ్ చేసినందుకు పుష్ప విల‌న్ పై కేసు న‌మోదు, సుమోటోగా స్వీక‌రించిన కేర‌ళ మాన‌వ‌హ‌క్కుల సంఘం

ఎమర్జెనీ రూమ్‌లో షూటింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ కమిషన్‌ సభ్యురాలు బీనా కుమారి వైద్యులపై ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు వైద్యులను వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

Fahadh Faasil

Tiruvanantpuram, June 29: మలయాళ స్టార్‌ నటుడు ఫవాద్‌ ఫాసిల్‌ (Fahadh Faasil) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేరళ మానవ హక్కుల సంఘం ఆయనపై సుమోటోగా కేసు నమోదు (Case on Fahadh Faasil) చేసింది. ఇందుకు కారణం ఉన్నది. ఫవాద్‌ ఫాసిల్‌ ప్రస్తుతం ‘పింకేలీ’ (Pinkeli) మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ షూటింగ్‌ను ఎర్నాకులంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారని.. దాంతో రోగులు ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తున్నది. రాత్రి సమయంలో షూటింగ్‌ జరిగిందని.. ఎమర్జెన్సీ వార్డులో షూటింగ్‌ చేసినట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై షూటింగ్‌ సమయంలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని సైతం ఆసుపత్రి లోపలికి తీసుకువెళ్లనివ్వలేదని ఆరోపణలు రాగా.. నిర్మాత సంఘం ఖండించింది.

Kalki Part 2 Update: క‌ల్కి పార్ట్ -2 రిలీజ్ పై ఇగ్ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వ‌నీద‌త్, ఇప్ప‌టికే 60శాతం షూటింగ్ పూర్త‌యిందన్న ద‌త్ 

అయితే, షూటింగ్‌ వ్యవహారంపై సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం ‘పింకెలి’ మూవీని నిర్మిస్తున్న ఫహద్ ఫాసిల్‌పై కేసు నమోదైంది. ఫావాద్‌ ఫాసిల్‌ హీరో, విలన్‌ పాత్రతో సంబంధం లేకుండా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో చేసినా.. ‘పుష్ప’లో భన్వర్‌ షింగ్‌ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ప్రస్తుతం పుష్ప-2 లోనూ నటిస్తున్నారు. ఇటీవల ఫహద్ ‘ఆవేశం’ మూవీతో తెలుగు అభిమానులను పలకరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకుపైగా కలెక్షన్‌ను రాబట్టింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఫవాద్‌ ఫాసిల్‌ నిర్మాతగానూ పలు సినిమాలను నిర్మిస్తున్నారు.