Theme of Kalki

Hyderabad, June 29: ప్రభాస్ కల్కి 2898AD (Kalki)సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) అదిరిపోయే రేంజ్ లో సినిమా అతీశారని అంటున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. కల్కి మొదటి రోజే 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. రెండు రోజుల్లో 298.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే కల్కి సినిమాకు పార్ట్ 2 ఉందని, కల్కి సినిమాటిక్ యూనివర్స్ కూడా ప్రకటించి వాటిల్లో మరిన్ని సినిమాలు ఉండొచ్చని కల్కి సినిమా క్లైమాక్స్ లో చెప్పేసారు. అలాగే కల్కి సినిమా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో ప్రేక్షకులు పార్ట్ 2 (Kalki Part-2) కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ – నాగ్ అశ్విన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లో కల్కి పార్ట్ 2 వర్క్ మరో 10 రోజుల్లో మొదలవుతుందని తెలిపారు. తాజాగా నిర్మాత అశ్వినీదత్ పలువురు పత్రికా రిపోర్ట్రర్స్ తో మాట్లాడారు.

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీపై రాజమౌళి సంచలన కామెంట్స్, చివరి 30 నిమిషాల సమయం నన్ను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందని వెల్లడి 

ఈ చర్చలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు. ఈ క్రమంలో కల్కి పార్ట్ 2 గురించి నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఆల్రెడీ కల్కి పార్ట్ 2 సినిమా 60 శాతం షూటింగ్ అయింది. త్వరలో మిగిలిన షూటింగ్ మొదలుపెడతాం. షూట్ అయ్యాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాం. పార్ట్ 3 గురించి ఇంకా ఆలోచించలేదు అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ అయిపోయిందని నిర్మాత అశ్వినీదత్ చెప్పడంతో కల్కి పార్ట్ 2 సినిమా వచ్చే సంవత్సరమే రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.

Kalki 2898 AD Review in Telugu: కల్కి 2898 ఏడీ రివ్యూ ఇదిగో, ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్, హాలీవుడ్‌కి సవాల్ విసిరిన నాగ్ అశ్విన్, కురుక్షేత్ర సంగ్రామం నుంచి కలియుగం వరకు సినిమా..  

కల్కి సినిమాలో ఆల్రెడీ మహాభారతంలోని అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు చూపించారు. ఈ సినిమాలో చూపించిన కథ, క్లైమాక్స్ ప్రకారం సెకండ్ పార్ట్ లో కల్కి పుట్టడం, మహాభారతంలోని అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలు కూడా రావొచ్చని తెలుస్తుంది. కృష్ణుడి పాత్ర ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో కల్కి పార్ట్ 2 సినిమాలో కలియుగాంతంలో మహాభారతంలోని చాలా పాత్రలు కల్కి పుట్టుక కోసం రావడం, కలితో పోరాడటం జరుగుతుందని తెలుస్తుంది. ఈ ఒక్క సినిమాతోనే చాలా హై ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇక పార్ట్ 2లో ఇంకే రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.