Harish Roy Battles Thyroid Cancer: కేజీఎఫ్ నటుడికి నాలుగో దశలో క్యాన్సర్, సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో గోప్యంగా ఉంచిన హరీశ్ రాయ్
అయితే ఆయన గొంతు క్యాన్సర్‌తో (Harish Roy battles Thyriod cancer)బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్ నాలుగో దశలో ఉంది.
ప్రముఖ కన్నడ నటుడు హరీశ్ రాయ్ కేజీఎఫ్ సినిమాలో ఖాసిం చాచాగా (KGF Actor Qasim Chacha) నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరైన విషయం విదితమే. అయితే ఆయన గొంతు క్యాన్సర్‌తో (Harish Roy battles Thyriod cancer)బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ క్యాన్సర్ నాలుగో దశలో ఉంది. కాగా ఈ విషయం బయటకు చెప్తే తనకు సినిమా ఛాన్సులు రావేమోనన్న భయంతో దాన్ని గోప్యంగా ఉంచాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాడు.
కొన్ని పరిస్థితులు మనకు అద్భుతాన్ని అందించవచ్చు, లేదంటే మనదగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టేలా చేయవచ్చు. విధి నుంచి మనం తప్పించుకునే ఛాన్సే లేదు. నేను మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనివల్ల మెడ దగ్గర వాచిపోయింది. నా దగ్గర డబ్బు లేకపోవడంతో శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాను. ఆ సమయంలో కేజీఎఫ్‌లో నటించే అవకాశం రావడంతో పెద్ద గడ్డంతో నా వాపు కనిపించకుండా కవర్ చేసుకున్నాను. నేను నటించిన సినిమాలు రిలీజయ్యేవరకు ఈ విషయం చెప్పకూడదనుకున్నాను
ప్రముఖ నటి అనన్య ఛటర్జీ మృతి, సంతాపం తెలిపిన చిత్ర పరిశ్రమ
'ఇప్పుడు క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంది. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఓసారైతే క్లైమాక్స్‌లోని ఓ సీన్‌లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది' అని తన దీనగాథను చెప్పుకొచ్చాడు హరీష్ రాయ్, ఒకసారి తన చికిత్స కోసం డబ్బులు కావాలని కోరుతూ ఓ వీడియో చేసినప్పటికీ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ధైర్యం చాల్లేదన్నాడు. ఇప్పుడతడికి క్యాన్సర్ ఉందన్న విషయం బహిర్గతం కావడంతో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారట!