Kolkata: 15 రోజుల వ్యవధిలో నలుగురు మోడల్స్ ఆత్మహత్య, బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోంది, కోలకతాలో ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌

మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్‌(21) మరణావార్త మరవక ముందు సరస్వతీ దాస్‌ కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున ఆమె శవమై కనిపించింది. కాస్బాలోని బేడియాదంగా వద్ద ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.

Representational Image (Photo Credits: File Image)

బెంగాలీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మోడల్‌, మేకప్‌ ఆర్టిస్ట్‌ సరస్వతి దాస్‌(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతుంది. బెంగాలీ నటి బిదిషా డి మజుందార్‌(21) మరణావార్త మరవక ముందు సరస్వతీ దాస్‌ కోల్‌కతాలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారు జామున ఆమె శవమై కనిపించింది. కాస్బాలోని బేడియాదంగా వద్ద ఆమె తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.

ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరు లేకపోవడంతో రాత్రి తన అమ్మమ్మతో కలిసి పడుకుంది సరస్వతీ దాస్‌. ఈ క్రమంలో తెల్లవారు జామున 2 గంటల పాత్రంలో సరస్వతి పక్కన లేకపోడంతో ఆమె అమ్మమ్మ ఇల్లంతా వేతికగా మరో గదిలో ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె అమ్మమ్మ ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించగా అప్పటికే సరస్వతీ దాస్‌ మారణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆత్మహత్యకు ముందు అర్థరాత్రి 1గంట వరకు ఆమె ఫోన్‌ మాట్లాడినట్లుగా తన ఫోన్‌ రికార్డులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్న చోట ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సరస్వతీ దాస్‌ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు జరపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌కు చందిన నటి, మోడల్‌లు ఇలా వరుసగా ఆత్మహత్యకు పాల్పడం సంచలనం రేపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు బెంగాలి మోడల్స్‌ ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా సరస్వతీ దాస్‌ అదే తరహాలో మరణించడం గమనార్హం.