#RamarajuForBheem : 'భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, గోండు బెబ్బులి కొమరం భీమ్' వచ్చేశాడు! రామ్ చరణ్ గంభీరమైన గళంతో 'RRR భీమ్' టీజర్ వీడియో రిలీజ్

ఆదిలాబాద్ అడవుల్లో ఎగసిన జ్వాల కొమరంభీం నిజాం రజాకర్లతో, బ్రిటీష్ వారితో ఏకకాలంలో ద్విముఖ పోరాటం చేశారు. అంతేకాకుండా ఈ విప్లవకారుడు మన్యందొర అల్లూరి సీతారామ రాజును తన అన్నగా భావించి ఆయన ద్వారా స్వాతంత్య్రోద్యమ స్పూర్థి పొందినట్లు చరిత్ర చెబుతుంది. మరి ఇందులో కొమరంభీంగా ఎన్టీఆర్ పాత్ర ఇంట్రొడక్షన్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.

NTR as Komaram Bheem First Look From RRR (Photo: DVV Entertainment)

RRR: ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్- రౌద్రం రణం రుధిరం' (RRR: Roudram Ranam Rudhiram) సినిమా నుంచి మరొక ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఈరోజు స్వాతంత్య్రోద్యమ వీరుడు, తెలంగాణ గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జయంతిని పురస్కరించుకొని, ఈ సినిమాలో 'భీమ్' పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో RRR ఒకటి. బాహుబలి తర్వాత.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అందులోనూ టాలీవుడ్ నుంచి ఇద్దరు అగ్రహీరోలు కలిసి పనిచేయడం, బాలీవుడ్ నుంచి టాప్ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమా పట్ల ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం దొర అల్లూరి సీతారామ రాజు (Ram Charan As Alluri Sitarama Raju) పాత్ర పోషిస్తుండగా, మరో మన్యం వీరుడు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ (NTR as Komaram Bheem) నటిస్తున్నారు. ఇది ఊహించుకుంటేనే ఒళ్లంతా రోమాలు నిక్కబొడుస్తాయి. ఎందుకంటే అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ ఇద్దరూ కూడా స్వాతంత్య్ర సమరయోధులే. అంతేకాకుండా వీరిద్దరూ శక్తివంతమైన విప్లవ వీరులే. రాజమౌళి కూడా ఈ రెండు పాత్రలకు సంబంధించిన ప్రస్తావన చేసేటపుడు పంచభూతాల్లోని రెండు శక్తులతో పోల్చుతున్నారు.

ఆదిలాబాద్ అడవుల్లో ఎగసిన జ్వాల కొమరంభీం నిజాం రజాకర్లతో, బ్రిటీష్ వారితో ఏకకాలంలో ద్విముఖ పోరాటం చేశారు. అంతేకాకుండా ఈ విప్లవకారుడు మన్యందొర అల్లూరి సీతారామ రాజును తన అన్నగా భావించి ఆయన ద్వారా స్వాతంత్య్రోద్యమ స్పూర్థి పొందినట్లు చరిత్ర చెబుతుంది. మరి ఇందులో కొమరంభీంగా ఎన్టీఆర్ పాత్ర ఇంట్రొడక్షన్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు.

Ramaraju For Bheem Teaser:

అంతకుముందు రామ్ చరణ్ పాత్రను 'అల్లూరి సీతారామరాజు నా అన్న' అంటూ ఎన్టీఆర్ గళంతో పరిచయం చేయించగా, ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రను 'కొమరం భీమ్ నా తమ్ముడు' అంటూ రామ్ చరణ్ గళంతో పరిచయం చేయించారు డైరెక్టర్ రాజమౌళి.

తాజాగా విడుదలైన టీజర్ అంచనాలకు తగినట్లుగానే హైఓల్టేజ్ పవర్ తో ఉంది. "వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యాలు సాగిలబడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు.. గోండు బెబ్బులి.. కొమురం భీమ్..." అంటూ బ్యాక్ గ్రాండ్‌లో రామ్ చరణ్ వాయిస్, స్క్రీన్ మీద ఎన్టీఆర్ అప్పియరెన్స్ టీజర్‌ను గర్జించేలా చేశాయి. ఎన్ని సార్లైనా ఈ టీజర్ చూడాలనిపించేలా ఉంది.

ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిసన్, రే స్టీవెన్సన్, అల్లిసన్ డూడీ, సముతిరాకని లాంటి బాలీవుడ్ మరియు హాలీవుడ్ స్తార్స్ నటిస్తున్నారు. ఒక మహత్తర కళాఖండంగా రూపుదిద్దుకుంటోన్న RRR 2021లో విడుదల కానుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement