Laila Movie Review in Telugu: లైలా మూవీ రివ్యూ ఇదిగో, విశ్వక్ లేడీ గెటప్ సినిమా ఎలా ఉందంటే?
వివాదాల మధ్య ఎట్టకేలకు విష్వక్ సేన్ లైలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన లేడి గెటప్‌లో కనిపించడమే హైలైట్‌గా ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది
వివాదాల మధ్య ఎట్టకేలకు విష్వక్ సేన్ లైలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన లేడి గెటప్‌లో కనిపించడమే హైలైట్‌గా ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 'లైలా' చిత్రం (Laila Movie Review in Telugu) ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక లేడి గెటప్‌లో విశ్వక్ సేన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? 'లైలా' ఎలా ఉంది అనే విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.
సినిమా కథలోకి వెళ్తే.. అమ్మ తనకు ఇచ్చిన జ్క్షాపకంగా, వారసత్వంగా భావిస్తూ హైదరాబాద్‌లోని పాతబస్తీలో సోను (విష్వక్ సేన్) బ్యూటీ పార్లర్‌ను నడిపిస్తుంటాడు. పాతబస్తీలోని ఆడవాళ్లందరూ సోను బ్యూటీ పార్లర్‌కే వస్తుంటారు. అలా తన పార్లర్‌కు వచ్చిన ఓ లేడి కస్టమర్‌కు బిజినెస్ కోసం ఆర్థిక సహాయం చేయడమే కాక, వాళ్లు చేస్తున్న కుకింగ్ ఆయిల్ బిజినెస్‌కు అంబాసిడర్‌గా తన ఫోటోను కూడా ప్రచారంలో వాడుకోమని చెబుతాడు.
అదే ప్రాంతంలో మటన్ బిజినెస్ చేస్తున్న రుస్తుమ్ (అభిమన్యు సింగ్)కు పెళ్లి కాకుండా బాధపడుతుంటే, సోనూ తన పార్లర్‌లో మేకప్‌తో అందంగా తయారు చేసిన ఓ అమ్మాయి (కామాక్షి భాస్కర్ల)ను చూసి రుస్తుమ్ పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం జరిగిన మరుసటి రోజే ఆమె అందం కేవలం మేకప్‌తోనే వచ్చిందని, సోను తనను మోసం చేశాడని అనుకుంటాడు రుస్తుం.
దీంతో పాటు రుస్తుం పెళ్లి వంటల్లో వాడిన నూనె ద్వారా ఫుడ్ పాయిజన్ అయి పెండ్లికి వచ్చిన వారందరూ ఆస్పత్రిలో జాయిన్ అవుతారు. సోను ఈ ఆయిల్ కంపెనీకి అంబాసిడర్‌గా ఉండటంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలుపెడతారు. పోలీసుల నుండి, రుస్తుం నుండి తప్పించుకోవడానిక సోను లేడి గెటప్‌లో లైలాగా మారిపోతాడు. ఆ తరువాత ఏం జరిగింది? లేడి గెటప్ లైలాగా సోను ఏం చేశాడు? తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు అనేది వెండితెరపై చూడాలి.
ఓ సాంగ్, ఫైట్, లవ్ ట్రాక్.. ఇలా రొటీన్ మూసలో కథ మొదలౌతుంది.హైదరబాదీ నేపధ్యంలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినప్పటికీ అవేవి కథ గమనానికి కలిసిరావు.ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తరువాత వైవిధ్యమైన కథలను అన్ని భాషల్లో చూస్తున్న ప్రేక్షకులకు ఇది అంత ఆసక్తికరంగా అనిపంచదనే చెప్పాలి. ఈ సమయంలో ఇలాంటి నాసిరకమైన, బోరింగ్ కథతో ప్రేక్షకకుల ముందుకు రావడమనే నిర్ణయమే సాహసమని చెప్పాలి.
ఏ మాత్రం ఆసక్తి లేని కథ, కథనాలతో కేవలం లేడి గెటప్‌తో సినిమాను లాగించేద్దామనే ఉద్దేశంతో దర్శకుడు రచనా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. సినిమాలో వినోదం, ఎమోషన్, సెంటిమెంట్ ఏమీ లేకుండా కథ నడిపించారు. సినిమా సెకండాఫ్‌లో ఉన్న సన్నివేశాల వల్ల ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే అవకాశం కూడా లేదు. ఈ సినిమా విషయంలో దర్శకుడు రామ్ నారాయణ కేవలం హీరో లేడి గెటప్‌లో కనిపించడమే సినిమాకు సక్సెస్ మంత్రంగా భావించడని అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ మాత్రం కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే..సినిమా నిరాశపర్చిందనే చెప్పాలి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)