Krishnam Raju Funeral: ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు,సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్‌ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు

Krishnam Raju no more

సినీ నటుడు, కేంద్రమాజీ మంత్రి కృష్ణంరాజు నిన్న గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు.

అయితే.. పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను (Krishnam Raju Funeral) సాయంత్రానికి మార్చారు. ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతుల మీదుగా అంత్యక్రియలు (Last rites of veteran actor Krishnam Raju) జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు.

ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట

ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్‌ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు హాజరు కానున్నారు.

కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1940 జనవరి 20న ఆయన జన్మించారు. కృష్ణంరాజు జీవిత భాగస్వామి శ్యామలా దేవి. కృష్ణంరాజుకు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్. 1966లో వచ్చిన చిలుక గోరింక సినిమాతో హీరోగా కృష్ణంరాజు సినీరంగ ప్రవేశం చేశారు. చివరిసారి నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. ‘రాధే శ్యామ్‌‘లో పరమ హంస పాత్రలో నటించారు. కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమర దీపం, కటకటాల రుద్రయ్య, మనవూరి పాండవులు, రంగూన్ రౌడీ, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, బావ బావమరిది, పల్నాటి పౌరుషం రుద్రమదేవి వంటి చిత్రాలు ప్రజాదరణ పొందాయి. ఎన్టీఆర్‌తో కలసి 7 సినిమాలు చేశారు. ఏన్నార్‌తో 6, కృష్ణ‌తో 21 సినిమాలు, శోభన్ బాబుతో కలిసి 8 సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు, కృష్ణ కాంబినేషన్ హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నాయి. కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు 11 సినిమాలు నిర్మించారు.

Krishnam Raju No More: రెబల్‌ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత, తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కృష్ణంరాజు, విషాదంలో సినీ పరిశ్రమ

కృష్ణంరాజు 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ నుండి గెలుపొందారు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుండి గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2009లో భారతీయ జనతా పార్టిని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు.