Hyderabad, SEP 11: రెబల్ స్టార్ (Rebal star) అనగానే ఇప్పటి జనరేషన్ కి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prbhas) గుర్తుకు వస్తాడు కానీ రియల్ రెబల్ స్టార్ అంటే కృష్ణంరాజు (Krishnam raju) మాత్రమే. ప్రభాస్ కి కృష్ణంరాజు పెద్దనాన్న వరస అవుతారు. 1940, జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విజయనరగ సామ్రాజ్య క్షత్రియుల వంశస్థుల కుటుంబంలో కృష్ణంరాజు జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు (Uppalapati venkata krishnam raju). చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీరంగ ప్రవేశంచేశారు. హీరోగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ ప్రతినాయకుడిగా కూడా అలరించారు. కృష్ణ హీరోగా రూపొందిన ‘అవేకళ్లు’ చిత్రంలో విలన్‌గా నిరూపించుకున్నారు. తన విలక్షణమైన నటనతో కొంతకాలంపాటు టాలీవుడ్ ఏలిన రెబల్ స్టార్ 183కుపైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప (Bhaktha kannappa), బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుతీసుకొచ్చాయి.
Saddened to learn about the demise of one of the most popular stars of Telugu Cinema, Rebel star Sri Krishnam Raju Garu
My wholehearted condolences to Prabhas Garu, his family members & friends
Rest in peace #KrishnamRaju Garu 🙏
— KTR (@KTRTRS) September 11, 2022
Krishnam Raju No More
నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్‌లో పలు చిత్రాలు రూపొందించారు. చివరిసారిగా ఆయన ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ (Radhe shayam) సినిమాలో వెండితెరపై కనిపించారు. ఆయన నటుడిగా మొత్తం 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకోగా, రాజకీయవేత్తగా కూడా సేవలు అందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి పలు సినిమాలో నటించగా, కృష్ణంరాజు చివరిగా నటించిన చిత్రం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. గచ్చిబౌలి AGI హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున గం.3:25 నిలకు తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం టాలీవుడ్ కి తీరని లోటు అనే చెప్పాలి.
సినిమాల్లో నటిస్తూనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1998 ఎన్నికల ముందు బీజేపీలో (BJP) చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.
అయితే 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో మరోసారి నర్సాపురం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి (Vajpeyee) హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదేస్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.