Hyderabad, SEP 10: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ (Puri Jagannath ) ఇటీవల లైగర్ (liger) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ ఎప్పుడు ఏ సినిమాతో వస్తాడా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం పూరీ రెడీ అవుతున్నాడు. అయితే ఈ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాయి కుమార్ (Sai kumar) అనే వ్యక్తి తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ సమీపంలోని దుర్గం చెరువులో దూకి సాయి కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి కొత్తగూడెంలో నివసిస్తున్న సాయి కుమార్, పూరీ జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా (assistant director) పనిచేశాడు.
అయితే ఇటీవల ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కాగా, టాలీవుడ్‌లో మెరిసేది అంతా బంగారం కాదనే విషయం ఈ ఘటనతో మరోసారి తేలిపోయింది. సినిమాలు ఉన్నా, ఆర్థికంగా చాలా మంది బాధపడుతున్నారు. సాయి కుమార్ లాంటి చాలా మంది ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని, విఫలం కావడంతో వేరే దారులు వెతుక్కుంటున్నారు.