Hyderabad, SEP 09: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన ‘మహర్షి’(Maharshi) చిత్రంలో భుజాన నాగలి వేసుకుని పొలం పనులకు వెళ్లే ఓ ముసలి రైతు అందరికీ గుర్తుండే ఉంటాడు. మహేష్ బాబు తనకు వ్యవసాయం నేర్పుతావా అని అడిగినప్పుడు.. ‘‘ఒక్కసారి ఈ మట్టిలో కాలు పెడితే.. ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది.. రా..’’ అని ఆయన చెప్పిన డైలాగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. ఆ పాత్ర చేసింది నటుడు గురుస్వామి (Guruswamy). మహర్షి సినిమాలో పాత్రతో మంచి గుర్తింపును తెచ్చుకుని మహర్షి గురుస్వామిగా అందరికీ గుర్తుండిపోయారు. అయితే మహర్షి సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గురుస్వామి, గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

Sitaramam OTT Release Date: అత్యద్భుత దృశ్యకావ్యం.. 'సీతారామం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే??  

కర్నూలు (Kurnool) జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి నాటక రంగంపై ఇష్టంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేశారు. అటుపై పలు నాటకాల్లో ఆయన నటించారు. కాగా, ఆయుష్మాన్ భవ అనే షార్ట్ ఫిలింలో ఆయన పర్ఫార్మెన్స్‌కు మంచి పేరు వచ్చింది. ఆ షార్ట్ ఫిలిం చూసే మహర్షి సినిమాలో ఆయన్ను సెలెక్ట్ చేశారు చిత్ర మేకర్స్.

Puri Mumbai to Hyd: నెలకు రూ. 10 లక్షల అద్దె భారం.. పైగా 'లైగర్' ఎఫెక్ట్.. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్.. 

మహేష్ బాబుకు వ్యవసాయం నేర్పించే పాత్ర తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆ సినిమా రిలీజ్ సమయంలో తెలిపారు. అయితే ఈ మహర్షి నటుడు మృతి చెందిన విషయం తెలుసుకుని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.